విశాఖపట్నం: రాష్ట్ర సచివాలయం నుంచి కార్యదర్శి విజయ నందన వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్
విశాఖపట్టణం: సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని, అన్ని చోట్లా ఫాగింగ్ చేయాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ ఆదేశించారు. స్వర్ణాంధ్ర పి-4 ఫౌండేషన్, పాజిటివ్ పబ్లిక్ పెరసప్సన్, రిలయెన్స్ కంప్రెస్డ్ బయోగ్యాస్ యూనిట్లు, సీజనల్ వ్యాధుల నియంత్రణకు చర్యలు, వివిధ సంక్షేమ వసతి గృహాల నిర్వహణ తదితర అంశాలపై గురువారం రాష్ట్ర సచివాలయం నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లా కలెక్టరేట్ వీసీ హాలు నుంచి వర్చువల్ గా జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ పాల్గొన్నారు.