భూపాలపల్లి: గిరిజన సంక్షేమ హాస్టల్లో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి : ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి రాజు
భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ఎస్టీ బాయ్స్ హాస్టల్ ముందు శుక్రవారం ఉదయం 9 గంటలకు ధర్నా చేపట్టినట్లు ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి రాజు తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరిజన సంక్షేమ హాస్టల్లో పనిచేస్తున్న డైలీ వెజెస్, ఔట్సోర్సింగ్ కార్మికుల సమస్యలు ప్రభుత్వం పరిష్కరించకపోవడంతో గత వారం రోజులుగా విద్యార్థులకు ఆహారం సరిగా దొరకక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వారే స్వయంగా వండుకునే పరిస్థితి నెలకొందని వెంటనే ప్రభుత్వం స్పందించి కార్మికుల సమస్యలు పరిష్కరించి విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తుంది అన్నారు.