శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి రైల్వే స్టేషన్ సమీపాన మంగళవారం సాయంత్రం 6 గంటల సమయంలో ప్రశాంతి ఎక్స్ప్రెస్ రైల్లో నుండి మధ్యప్రదేశ్ కు చెందిన జితేందర్ సింగ్ అనే వ్యక్తి రైల్లో నుండి ప్రమాదవశాత్తు కిందకు పడిపోవడంతో రెండు కాళ్లు విరిగిపోవడంతో హుటాహుటిన మెరుగైన చికిత్స కోసం అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆస్పత్రికి తీసుకువచ్చారు. బెంగళూరు నుండి ఒడిస్సా కు రైల్లో వెళ్తుండగా పుట్టపర్తి రైల్వే స్టేషన్ సమీపన ప్రమాదం జరిగినది. ఈ సంఘటనకు సంబంధించి రైల్వే పోలీసుల కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. జితేందర్ సింగ్ ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉన్నదని వైద్యులు రామాంజనేయులు తెలిపారు.