నార్సింగి: వల్లూరు వద్ద రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన చిరుత పులికీ దహన సంస్కారాలు పూర్తి : DFO జోజి
Narsingi, Medak | Jan 31, 2025 రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన చిరుత పులికీ దహన సంస్కారాలు పూర్తి రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన చిరుత పులి దహన కార్యక్రమాన్ని నార్సింగ్ మండల పరిధిలోని వల్లూరు అటవీ ప్రాంతంలో శుక్రవారం ఉదయం నిర్వహించారు. మెదక్ జిల్లా డీఎఫ్ఓ జోజి, రామాయంపేట రేంజ్ ఆఫీసర్ విద్యాసాగర్, నార్సింగ్ ఎస్ఐ అహ్మద్ మోహిఉద్దీన్ సమక్షంలో వెటర్నరీ వైద్య బృందం పోస్టుమార్టం నిర్వహించి దహన కార్యక్రమాలను చేశారు. ఈనెల 30వ తేదీ గురువారం రాత్రి 7:30 గంటలకు ప్రాంతంలో రోడ్డు దాటడానికి ప్రయత్నిస్తున్న చిరుతపులిని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో చిరుత పులి మృతి చెందింది.