మంత్రాలయం: పెద్ద కడబూరు కేజీబీవీ గడ్డకట్టి ఎందుకు పనికి రాకుండా పోయిన నాడు-నేడు పథకం కింద పాఠశాలకు పంపిన సిమెంట్ బస్తాల
పెద్ద కడబూరు:నాడు-నేడు పథకం కింద పాఠశాలకు పంపిన సిమెంట్ బస్తాలు ఎందుకూ పనికి రాకుండా పోయాయి. పెద్ద కడబూరు కేజీబీవీ కళాశాలలో దాదాపు 100 సిమెంట్ బస్తాలు పూర్తిగా గడ్డకట్టి వినియోగానికి ఉపయోగపడని స్థితికి మారాయి. సిమెంట్ బస్తాల నిల్వ కారణంగా తరగతి గదుల్లోకి దుమ్ము చేరి విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని కళాశాల సిబ్బంది శనివారం తెలిపారు. వాటిని తొలగించాలని ఉన్నతాధికారులను కోరినా ఫలితం లేదని వారు వాపోయారు.