గంగాధర నెల్లూరు: ఎస్ఆర్ పురం మండలం తయ్యూరు పాయకట్టు ఇలవేల్పు ఆరిమాని గంగమ్మకు ప్రత్యేక పూజలు
ఎస్ఆర్ పురం మండలం తయ్యూరు పాయకట్టు ఇలవేల్పు ఆరిమాని గంగమ్మ ఆలయంలో మంగళవారం పూజలు నిర్వహించారు. ప్రధాన అర్చకులు వెంకటచలపతి ఆచార్యులు సుప్రభాత సేవతో అమ్మవారిని మేల్కొల్పి సుగంధ ద్రవ్యాలతో అభిషేకించారు. వివిధ పుష్పాలతో సుందరంగా అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు.