గొల్లపల్లి మండలం లక్ష్మీపూర్ గ్రామ శివారులో ఉన్న సూచిక బోర్డు గత కొన్ని రోజులుగా చెట్టుపై ఒరిగింది. దీంతో రంగదామునిపల్లె - లక్ష్మీపూర్ గ్రామ సరిహద్దు ప్రాంతానికి దారి చూపే సూచిక బోర్డు సరిగ్గా కనిపించక ప్రయాణికులు గందరగోళానికి గురవుతున్నారు. ఈ మార్గంలో కొత్తగా వచ్చే ప్రయాణికులు రూట్ తెలియక ఇబ్బందులు పడుతున్నారని స్థానికులు తెలిపారు.