ప్రొద్దుటూరు: అక్రమంగా ఇసుక తరలిస్తున్న వాహనాలను సీజ్ చేసిన రూరల్ ఎస్సై రాజు
Proddatur, YSR | Nov 25, 2025 కడప జిల్లా ప్రొద్దుటూరు నియోజకవర్గం లో అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక తవ్వకాలు తరలింపు పై కఠిన చర్యలు తప్పవని ప్రొద్దుటూరు రూలర్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ రాజు మంగళవారం తెలిపారు. ఇసుక అక్రమ రవాణా చేస్తున్న వాహనాలపై తాలూకా పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. చోడూరు గ్రామ పరిధిలో అక్రమ రవాణా జరుగుతుందన్న సమాచారం మేరకు ఆరు ఇసుక ట్రాక్టర్లు ఒక టిప్పర్ రెండు జెసిబిలను రూలర్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వాహనాలను స్టేషన్కు తరలించి కేసు నమోదు చేశామని తెలిపారు.