మఖ్తల్: మల్లేపల్లి ప్రజల భద్రత కొరకు పోలీస్ కవాతు ఎస్సై శ్రీనివాసులు
పార్లమెంట్ ఎన్నికలలో ఏలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రజల భద్రతపై, భరోసా కల్పించడానికి కేంద్ర సాయుధ బలగాలచే కవాతు నిర్వహించడం జరిగిందని ఎస్ఐ శ్రీనివాసులు తెలిపారు. ఉట్కూర్ మండలంలోని సమస్యత్మక గ్రామాలైన నాగిరెడ్డిపల్లి, మల్లేపల్లి గ్రామాలలో ఆదివారం సాయంత్రం కేంద్రం సాయుధ పోలీసు బలగాలచే ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు.