కీసర: కీసర గుట్ట బ్రహ్మోత్సవాలకు హాజరుకావాలని సీఎం రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన టిపిసిసి ఉపాధ్యక్షుడు వజ్రేష్ యాదవ్
శివరాత్రి సందర్భంగా కీసర గుట్టపై నిర్వహించే శ్రీ రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు హాజరుకావాలని టీపీసీసీ ఉపాధ్యక్షుడు, మేడ్చల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి తోటకూర వజ్రేష్ యాదవ్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డిని శుక్రవారం మధ్యాహ్నం ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వానించారు. ముఖ్యమంత్రిని కలిసిన వారిలో కీసర గుట్ట చైర్మన్ తాటకం నారాయణ శర్మ, టెంపుల్ డైరెక్టర్లు తదితరులు ఉన్నారు.