తలకొండపల్లి: ఈదురు గాలులతో కూడిన వర్షం కారణంగా దేవుని పడకలు గ్రామంలో రోడ్లపై కూలిన చెట్లు
తలకొండపల్లి మండలంలోని దేవునిపడకలు గ్రామంలో గత 2 రోజులుగా ఈదురుగాలులతో కూడిన వర్షం కారణంగా రోడ్లపై చెట్లు కూలిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆదివారం ఉదయం చెట్లు రోడ్లపై ఉండడంతో ప్రయాణికులు చెట్లను తొలగించి వెళ్లారు.