కామారెడ్డి: అప్పుల బాధతో రైతు ఆత్మహత్య: మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు ఎస్ఐ స్రవంతి వెల్లడి
అప్పుల పాలైన ఓ రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన శనివారం సంగమేశ్వర్ జరిగింది. SI స్రవంతి తెలిపిన వివరాలిలా.. గ్రామానికి చెందిన పెంటయ్య (26)కు రెండు ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. సాగునీటి కోసం 10 బోర్లు వేసినప్పటికీ నీరు పడలేదు. దీంతో అప్పులు పెరిగాయి. తీవ్ర మనస్తాపానికి గురైన పెంటయ్య ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు SI వివరించారు