శ్రీకాకుళం: కార్గో ఎయిర్ పోర్ట్ కోసం బలవంతపు భూ సేకరణ ఆపాలి: సీపీఐ జిల్లా కార్యదర్శి గోవిందరావు డిమాండ్
పలాసలో కార్గో ఎయిర్ పోర్ట్ కోసం బలవంతపు భూ సేకరణ ఆపాలని,సముద్ర తీర ప్రాంతాన్ని కార్పొరేట్లకు కట్టబెట్ట వద్దని సిపిఐ జిల్లా కార్యదర్శి గోవిందరావ్ డిమాండ్ చేశారు. శుక్రవారం పలాసలో వామపక్షాల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు.ఈ సందర్బంగా గోవిందరావ్ మాట్లాడుతూ పలాస, ఉద్దానం వంటి ప్రాంతాల్లో వ్యవసాయ ఆదారిత పరిశ్రమలు తేవాలే కాని కార్పొరేట్లకు అనువుగా ఉన్న కోర్గో ఎయిర్పోర్ట్ లు వద్దని డిమాండ్ చేశారు.