హిమాయత్ నగర్: తెల్ల రేషన్, ఆరోగ్యశ్రీ కార్డుల సంఖ్య తగ్గి మేము బ్రతకగలం అనే ఆలోచన ప్రజల్లో రావాలి: ఎంపీ ఈటల రాజేందర్
హైదరాబాదులోని విద్యానగర్లో పీఎం విశ్వకర్మ ట్రైనింగ్ పూర్తి చేసిన వారికి సర్టిఫికెట్ల పంపిణీ కార్యక్రమం శుక్రవారం సాయంత్రం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎంపీ ఈటల రాజేందర్ పాల్గొని వారికి సర్టిఫికెట్లు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దేశంలో ఉచితాలు వద్దనే స్థాయికి ప్రజల్లో మార్పు రావాల్సిన అవసరం ఉందని అన్నారు. తెల్లరేషన్, ఆరోగ్యశ్రీ కార్డుల సంఖ్య తగ్గి మేము బతకగలమని ఆలోచన ప్రజల్లో రావాలని అన్నారు.