టీడీపీ జిల్లా అధ్యక్షులుగా ఎంపికైన పూల నాగరాజు, ప్రధాన కార్యదర్శిగా ఎంపికైన శ్రీధర్ చౌదరి లు ఆదివారం కళ్యాణదుర్గం ఎమ్మెల్యే సురేంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారు ఎమ్మెల్యేకు బొకేలు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పూల నాగరాజు, శ్రీధర్ చౌదరిని శాలువాలు, పూల మాలలతో సన్మానించారు. పార్టీ బలోపేతం కోసం కృషి చేయాలని ఎమ్మెల్యే వారికి సూచించారు.