ధర్మారం: దొంగతుర్తిలో తాటి చెట్టుపై నుండి కింద పడిన గీతకార్మికుడు, హాస్పిటల్ కు తరలించిన స్థానికులు
ధర్మారం మండలం దొంగతుర్తి గ్రామానికి చెందిన పంతంగి శ్రీనివాస్ గౌడ్ శనివారం తాడిచెట్టు మీద నుంచి మోకు జారి కిందపడ్డాడు. దీంతో తీవ్ర గాయాలు కాగా హుటాహుటిన తోటి గీత కార్మికులు పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా,వారిని వెంటనే అక్కడినుండి కరీంనగర్ ప్రభుత్వ హాస్పిటల్ తరలించారు