ఘన్పూర్ స్టేషన్: స్టేషన్ ఘన్ పూర్ : చాగల్లు జాతీయ రహదారిపై గుర్తు తెలియని వాహనం ఢీకొని వృద్ధుడికి తీవ్ర గాయాలు
స్టేషన్ ఘన్ పూర్ మండలం చాగల్లు జాతీయరహదారిపై కాలినడకన వెళ్తున్న పత్రం హుస్సేన్ అనే వృద్ధుడిని గుర్తుతెలియని వాహనం వెనక నుండి గురువారం సాయంత్రం 4 గంటలకు ఢీకొనగా హుస్సేన్ తీవ్ర గాయాల పాలయ్యాడు. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం ఘన్పూర్ కు చెందిన హుస్సేన్ చాగల్లు నుండి ఘన్పూర్ వైపు రోడ్డు వెంట నడుచుకుంటూ వెలుతుండగా వెనకాలే వస్తున్న గుర్తు తెలియని వాహనం అతని ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆయన రోడ్డుపై పడిపోగా స్థానికులు గమనించి 108 వాహనానికి ఫోన్ చేయగా వాహనం చాగల్ కు చేరుకుని తీవ్రంగా గాయపడిన హుస్సేన్ ను చికిత్స నిమిత్తం వరంగల్ ఎంజిఎం తరలించారు.