కనిగిరి పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయం ఎదుట ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో సోమవారం ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. గ్రామీణ ఉపాధి కూలీలకు నష్టం కలిగించేలా కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన వి బి జి- రామ్ జి పథకాన్ని రద్దుచేసి పాత జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని పునరుద్ధరించాలని కార్యక్రమానికి హాజరైన ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం ఉమ్మడి ప్రకాశం జిల్లా కార్యదర్శి రామారావు డిమాండ్ చేశారు. వి బి జి-రాంజీ పథకంలో రాష్ట్ర ప్రభుత్వం 40% షరతు విధించాలన్న నిబంధన సరికాదన్నారు. కూలీలకు 800 రూపాయల దినసరి వేతనం, 200 రోజుల పని కల్పించాలన్నారు.