ఆళ్లగడ్డలో జాతీయ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో, భారీ ర్యాలీ
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో సోమవారం ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం పురస్కరించుకొని ఆరోగ్యశాఖ అధికారులు, సిబ్బంది పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా హాస్పిటల్ సూపర్నెంట్ డాక్టర్ సుజాత మాట్లాడుతూ.. ప్రతి ఏడాది డిసెంబర్ 1న ఎయిడ్స్ దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతుందని తెలిపారు. ఎయిడ్స్ రోగులపై వివక్షత చూపరాదని సూచించారు. ఈ కార్యక్రమంలో చైతన్య ఎడ్యుకేషనల్ సొసైటీ మేనేజర్ వర్ధనాచారి, నోడల్ ఆఫీసర్ లెక్చరర్ మధుశేఖర్ మల్లేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.