సంతనూతలపాడు ఎంపీడీవో కార్యాలయంలో బుధవారం మండల ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం జరిగింది. సమావేశంలో ఎంపీడీవో సురేష్ బాబు శాఖల వారీగా అధికారులతో అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.... అధికారులు ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేసి ప్రజల సమస్యలను పరిష్కరించాలని సూచించారు. మండలంలో అభివృద్ధి పనులు వేగంగా జరిగే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామాల్లో ఎక్కడా కూడా నీటి ఎద్దడి తలెత్తకుండా చూడాలని, మౌలిక వసతుల కల్పనకు అధికారులు కృషి చేయాలన్నారు.