సిరికొండ: సాత్ మోరీ గ్రామంలో ఘనంగా దండారీ వేడుకలు, పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ పార్లమెంట్ ఇంచార్జీ ఆత్రం సుగుణక్క
ఆదివాసీల సంస్కృతి సాంప్రదాయాలను కాపాడటానికి కాంగ్రెస్ ప్రజా ప్రకభుత్వం కృషి చేస్తుందని కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ పార్లమెంట్ ఇంచార్జీ ఆత్రం సుగుణక్క అన్నారు.సిరికొండ మండలం సాత్ మోరీ గ్రామంలో జరిగిన దండారి ఉత్సవాల్లో ఆమె పాల్గొన్నారు.గ్రామానికి వచ్చిన సుగుణక్కకు ఆదివాసులు ఘన స్వాగతం పలికారు.ఆదివాసీ మహిళలతో కలిసి సుగుణక్క దండారి నృత్యం చేశారు.ఆదివాసుల సమస్యల పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానని పేర్కొన్నారు.ఉమ్మడి జిల్లాలోని ఆదివాసి గూడాల్లో నిర్వహిస్తున్న దండారి వేడుకల కోసం రాష్ట్ర ప్రభుత్వం కోటి 50 లక్షల రూపాయల నిధులను కేటాయించిందని అన్నారు.