కణేకల్లు మండలం గనిగెర సమీపంలో బళ్ళారి రహదారిపై HLC బ్రిడ్జి వద్ద రోడ్డు గుంతల మయంగా మారడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బ్రిడ్జి పక్కన పెద్ద పెద్ద గోతులు ఏర్పడగా శ్రీరామ రెడ్డి తాగునీటి పైప్ లైన్ పగిలి ఆ గుంతల్లో నీరు చేరుతోంది. దీంతో బురదమయంగా మారింది. బైక్ రైడర్లు పలుమార్లు కిందపడి గాయాలపాలవుతున్నారని స్థానికులు ఆందోళన వ్యక్తంచేశారు. అధికారులు రోడ్డు మరమ్మతులు చేపట్టాలని కోరారు.