జడ్చర్ల: జడ్చర్ల ఫ్లైఓవర్ ప్రాంతంలో భారీగా ట్రాఫిక్ జాం, వందలాదిగా నిలిచిపోయిన వాహనాలు
జడ్చర్ల పట్టణ కేంద్రంలోని న్యూ బస్టాండ్ సమీపంలో ఫ్లైఓవర్ ప్రాంతంలోని భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. పెళ్లిళ్ల సీజన్ కావడంతో వాహనాలు ఒక్కసారిగా రోడ్డుపైకి రావడంతో ఎక్కడికి అక్కడే కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. అసలే వేసవికాలం కావడంతో నిలిచిపోయిన వాహనదారులు ప్రయాణికులు మండుటెండలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.