చేవెళ్ల: ఊరెళ్ల గ్రామంలోని ఫామ్ హౌస్ లో జరిగిన నారాయణదాసు హత్యకు గల కారణాలను తెలిపిన పోలీసులు
చేవెళ్ల మండలంలోని ఊరెళ్ల గ్రామంలోని ఓ ఫామ్ హౌస్ లో నారాయణదాసు అనే వ్యక్తి హత్య జరిగిన విషయం తెలిసిందే. కాగా ఈ హత్యలో డబ్బే కారణమని పోలీసులు వెల్లడించారు. గురువారం సాయంత్రం 4:00 గంటల సమయంలో పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బామ్మర్ది భాస్కర్ భూమి విషయంలో డబ్బు ఇస్తానని చెప్పి ఇవ్వకపోవడంతో భాస్కర్ అతనితో దూరంగా ఉంటున్నాడు. కాగా మంగళవారం వీరిద్దరూ ఫామ్ హౌస్ కి వెళ్లి మద్యం తాగుతుండగా డబ్బు విషయంలో గొడవ రావడంతో భాస్కర్ నారాయణదాసును హత్య చేశాడు.