ఆలూరు: ఆలూరులో సీనియర్లను కలుపుకోకుంటే గెలవడం కష్టం: గుంతకల్ ఎమ్మెల్యే జయరాం
Alur, Kurnool | Dec 2, 2025 రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వచ్చినా ఆలూరులో ఆ పార్టీ అధికారంలో లేనట్లే ఉందని, వాల్మీకులు నిరుత్సాహంగా ఉన్నారని గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం తెలిపారు. కర్నూలు జిల్లాలోని ఆలూరు టీడీపీ ఇన్ఛార్జి పనితీరుపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. త్వరలో జరగబోయే స్థానిక ఎన్నికల్లో సీనియర్ నాయకులను కలుపుకోలేకపోతే టీడీపీ గెలవడం చాలా కష్టమని ఆయన స్పష్టం చేశారు.