గంగాధర నెల్లూరు: కార్వేటినగరం మండలం కృష్ణాపురం ప్రాజెక్టు గేట్లు ఎత్తివేత
వర్షాల కారణంగా కార్వేటినగరం మండలం కృష్ణాపురం ప్రాజెక్టుకు భారీగా నీరు చేరుతోంది. ఈ సందర్భంగా ఇరిగేషన్ శాఖ అధికారి రాజీవ్ శనివారం గేట్లు ఎత్తి దిగువకు నీరు విడుదల చేశారు. ఆయన మాట్లాడుతూ.. 800 క్యూసెక్కుల నీరు విడుదల చేశామని చెప్పారు. కుశస్థలి నది ప్రవాహం ఎక్కువగా ఉంటుందని.. అటువైపు ప్రజలు ఎవరూ వెళ్లరాదని ఆదేశించారు.