పిజిఆర్ఎస్ అర్జీలను వేగవంతంగా పరిష్కరించాలి : జాయింట్ కలెక్టర్ సి.విష్ణుచరణ్
Anantapur Urban, Anantapur | Mar 30, 2026
అనంతపురం కలెక్టరేట్ లోని రెవెన్యూ భవనంలో సోమవారం ఉదయం 11 గంటల సమయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రీడ్రసెల్ సిస్టం, పిజిఆర్ఎస్), రెవెన్యూ క్లినిక్ కార్యక్రమం నిర్వహించగా, ఇందులో భాగంగా జిల్లాలోని ఆయా మండలాల నుంచి వివిధ రకాల సమస్యలతో వచ్చిన అర్జీదారుల నుండి జాయింట్ కలెక్టర్ సి.విష్ణుచరణ్ అర్జీలను స్వీకరించారు.జాయింట్ కలెక్టర్ తో పాటు అర్జీలను స్వీకరించే కార్యక్రమంలో డిఆర్ఓ ఏ.మలోల, జిల్లా ఫారెస్ట్ సెటిల్మెంట్ అధికారి జి.రామకృష్ణారెడ్డి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు ఆనంద్, పద్మావతి, ఆయా శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.