కర్ణాటక రాష్ట్రానికి చెందిన మంజు మరియు రామదాసు అనే ఇద్దరు చెడు వ్యసనాలు క్రికెట్ బెట్టింగ్ ఇతర అసాంఘిక కార్యకలాపాలతో తీవ్ర అప్పుల పాలై దొంగతనాలకు పాల్పడుతున్నట్లుగా అనంతపురం జిల్లా ఎస్పీ జగదీష్ వెల్లడించారు. వారి వద్ద నుంచి 70 లక్షల విలువ చేసే బంగారు వెండి ఆభరణాలతో పాటు లక్ష రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలియజేశారు. అనంతపురం సీసీఎస్ పోలీసులు అత్యంత చాకచక్యంగా వారిని అరెస్టు చేసినట్లు వెల్లడించారు.