నార్సింగి: నార్సింగ్ మండలం వల్లూరు ఫారెస్ట్ వద్ద నడుచుకుంటూ వస్తున్న చిరుత పులిని గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో మృతి
Narsingi, Medak | Jan 30, 2025 నార్సింగి మండల పరిధిలోని వల్లూరు అటవీ ప్రాంతం నుండి మగ చిరుత పులి సుమారు రెండు సంవత్సరాల పైబడి వయస్సు. గురువారం రాత్రి 7:30 గంటల ప్రాంతంలో అటవీ ప్రాంతం నుంచిజాతీయ రహదారిపైకి వస్తుండగా హైదరాబాద్ వైపు నుంచి వస్తున్న వాహనం ఢీకొనడంతో తీవ్ర గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడ్డ చిరుత పులిరహదారి వెంట వస్తున్న వాహనాలపైకిలేవడానికి ప్రయత్నం చేసింది. ఈ క్రమంలో గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో కింద పడి మృతి చెందింది 44వ రహదారిపై పెద్దపులి మృతి చెందిన విషయం తెలుసుకున్న చేగుంట నార్సింగ్ ఎస్ఐలు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. అటవీ అధికారులు వచ్చే వరకు అక్కడే ఉన్నారు.