పసలవాళ్ళపల్లి కి చెందిన రైతు క్రిమిసంహారక మందు సేవించి ఆత్మహత్యాయత్నం
గుర్రంకొండ మండలం ఎల్లుట్ల గ్రామం పసలవాళ్ళపల్లి కి చెందిన రైతు వెంకటరమణారెడ్డి శనివారం క్రిమిసంహారక మందు సేవించి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. తను సాగు చేస్తున్న భూమిలో రెవెన్యూ అధికారులు ప్రభుత్వ భూమి అని హెచ్చరిక బోర్డు నాటారని మన స్థాపన చెంది పురుగుల మందు తాగినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. హుటాహుటిన వాయల్పాడు ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అయితే పరిస్థితి విషమంగా ఉండటంతో 108 లో మదనపల్లి ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు.