కుప్పం: పట్టణంలో శ్రీ మునీశ్వర స్వామి శోభాయాత్ర
కుప్పం పట్టణంలోని మర్రిమాను వీధిలోని శ్రీమునీశ్వర స్వామి దేవాలయ కుంబాభిషేకం సందర్భంగా స్వామివారి విగ్రహ శోభాయాత్ర కుప్పంలో ఘనంగా నిర్వహించారు. 29వ తేదీ నుంచి డిసెంబర్ ఒకటో తేదీ వరకు ఆలయ మహా కుంభాభిషేకం కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. స్వామి వారి విగ్రహ శోభాయాత్ర సందర్భంగా భక్తులు పూజలు నిర్వహించారు.