పూతలపట్టు: వడ్డార్లపల్లిలో మద్యం తాగి తొట్టిలో పడి వ్యక్తి మృతి
తొట్టిపై కూర్చుని మద్యం తాగి మత్తులో నీటి కోసం లొంగి తొట్టిలో పడిపోయి వ్యక్తి మృతి చెందిన సంఘటన సోమవారం రాత్రి చోటుచేసుకుంది స్థానికుల కథ మేరకు చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం పూతలపట్టు మండలంలోని వడ్డార్లపల్లి గ్రామం లో ఈ సంఘటన జరిగినట్లు తెలిపారు మంగళవారం స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు మునిరత్నం 65 అదే గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి మృతదేహాన్ని మంగళవారం రాత్రి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు పేర్కొన్నారు ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు.