ప్రొద్దుటూరు: వసంత పేట మున్సిపల్ హైస్కూల్లో పదిమంది విద్యార్థులకు తీవ్ర అస్వస్థత
Proddatur, YSR | Nov 28, 2025 ప్రొద్దుటూరు లోని వసంతపేట మున్సిపల్ హై స్కూల్ లో మధ్యాహ్న భోజనం తినడం వల్ల పదిమంది విద్యార్థులు తీవ్ర అస్తస్వతుకు గురయ్యారు. మధ్యాహ్న భోజనం లో పాఠశాలలో తయారు చేసిన అన్నం, పప్పును విద్యార్థులకు వడ్డించారు. అయితే కొద్దిసేపటికి పప్పు దుర్వాసన వస్తుందని, బాగాలేదని మొదట తిన్న కొంత మంది విద్యార్థులు చెప్పడంతో ఆ పప్పు ను వడ్డించకుండా పక్కన పెట్టేసి బయట నుంచి పప్పు తీసుకుని వచ్చి విద్యార్థులకు వడ్డించారు. మొదట పాఠశాలలో తయారు చేసిన పప్పును తిన్న పదిమంది ఆరవ తరగతి విద్యార్థులకు కొద్దిసేపటికి కడుపునొప్పి, వాంతులు అయ్యాయి. విద్యార్థులు కడుపునొప్పితో తీవ్ర ఇబ్బంది పడుతున్న విషయం బయటికి