ప్రొద్దుటూరు: తెలుగుదేశం పార్టీలో కష్టపడే వరకే గుర్తింపు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి
Proddatur, YSR | Nov 26, 2025 తెలుగుదేశం పార్టీలో కష్టపడే ప్రతి ఒక్కరికీ తప్పక గుర్తింపు ఉంటుందని ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి తెలిపారు. బుధవారం మధ్యాహ్నం కడప జిల్లా ప్రొద్దుటూరు టీటీడీ కళ్యాణ మండలంలో తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షుడు చల్ల రాజగోపాల్ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి మాట్లాడుతూ.. పార్టీ కార్యకర్తల కృషి వల్లే అధికారంలోకి వచ్చామన్నారు. జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసుల రెడ్డి, రాష్ట్ర షేక్ వెల్ఫేర్ ఛైర్మన్ ముక్తియార్ కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున్న పాల్గొన్నారు.