గుత్తి సాయి స్పోర్ట్స్ యూనిట్ కు చెందిన ఏడు మంది తైక్వాండో జాతీయస్థాయి పోటీలకు ఎంపికైనట్లు మాస్టర్ సాయి తేజ సోమవారం చెప్పారు. గుంటూరు జిల్లా తెనాలిలో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రతిభ కనబరిచిన ఏడు మందిని జాతీయస్థాయికి ఎంపిక చేశారు. కరిష్మా, పూజిత, అంజుమ్, సాయి తేజ, అభిరామ్, గణేష్, హెచ్. కాంత్ లు ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయికి ఎంపికయ్యారు. జనవరి 15న జైపూర్లో జరిగే జాతీయస్థాయి పోటీల్లో పాల్గొంటారు.