కోదాడ: కోదాడ గారడి మాటలతో రైతాంగాన్ని సీఎం మోసం చేస్తున్నాడు రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్ రావు
Kodad, Suryapet | Apr 24, 2024 హామీలతో,వాగ్దానాలతో ముఖ్యంగా రైతాంగాన్ని నమ్మించి,వంచించడంలో రేవంత్ రెడ్డి గారడీ మాస్టర్ లకు సరిజోడి అయ్యాడని తెలుగు రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొల్లు వెంకటేశ్వరరావు విమర్శించారు.నడిగూడెం మండల కేంద్రంలో విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల సమయంలో స్పష్టంగా డిసెంబర్ 9వ తేదీని ప్రస్తావించి మరీ రేవంత్ రెడ్డి రైతు బందు,రెండు లక్షల రైతు రుణం మాఫీ చేస్తానని వాగ్దానం చేసాడని గుర్తు చేశారు.తీరా గెలిచి ముఖ్యమంత్రి ఐన తరువాత వంద రోజులని,ఆగష్టు 15 తరువాత అని గారడీ మాస్టర్ లా మాట్లాడటం తగదని చెప్పారు.