నంద్యాల జిల్లా డోన్ జాతీయ రహదారిపై మంగళవారం తెల్లవారుజామున ఆర్టీవో క్రాంతి కుమార్ ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. నిబంధనలు ఉల్లంఘించి సరకులు తరలిస్తున్న మూడు బస్సులకు రూ.30 వేల జరిమానా విధించారు. రోడ్డు పన్ను చెల్లించకుండా నడుపుతున్న నాగాలాండ్ రిజిస్ట్రేషన్ గల SLV ట్రావెల్స్ బస్సుకు రూ.2.62 లక్షల భారీ జరిమానా వేశారు. పండుగ వేళ అక్రమ రవాణా, అధిక ఛార్జీలు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు