కణేకల్లు మండలంలోని ఎర్రగుంట గ్రామంలో దాన్యం కొనుగోలు కేంద్రాన్ని కళ్యాణదుర్గం RDO వసంత బాబు శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రైతులకు నగదు జమ వేగవంతం అయ్యేలా చూస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వం రైతులకు అనుకూలంగా దాన్యం కొనుగోలు చేపట్టి గిట్టుబాటు ధర చెల్లిస్తోందన్నారు. మండల రెవెన్యూ అధికారులు, టిడిపి మండల అధ్యక్షులు వన్నారెడ్డి ఆయన వెంట ఉన్నారు.