మదనపల్లె కిడ్నీ రాకెట్ పై సిబిఐ విచారణ చేపట్టాలి. సిపిఐ పార్టీ డిమాండ్.
అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో సిపిఐ పార్టీ జిల్లా సహాయ కార్యదర్శి తోపు కృష్ణప్ప, నియోజవర్గ కార్యదర్శి కే మురళి. కిడ్నీ రాకెట్ ఉదాంతంపై సిబిఐ విచారణ చేపట్టాలని సబ్ కలెక్టర్ కార్యాలయంలో సోమవారం వినతిపత్రం సమర్పించారు అనంతరం వారు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కిడ్నీ రాకెట్ నిజాలను నిగ్గు తేల్చడానికి సిబిఐ విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు గంగాధర్ హరి నర్సింలు రవి తదితరులు పాల్గొన్నారు