పెద్దపల్లి: నాణ్యమైన ధాన్యాన్ని సత్వరమే కొనుగోలు చేసి రైస్ మిల్లులకు తరలించాలి :జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష
కొనుగోలు కేంద్రాలకు వచ్చిన నాణ్యమైన ధాన్యాన్ని సత్వరమే కొనుగోలు చేసి రైస్ మిల్లులకు తరలించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు. బుధవారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష, అదనపు కలెక్టర్ డి.వేణు తో కలిసి సుల్తానాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డు ను సందర్శించి ధాన్యం కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేశారు. భారత ఆహార సంస్థ నిర్దేశించిన నాణ్యత ప్రమాణాలు వచ్చిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని, కొనుగోలు కేంద్రానికి వచ్చిన ధాన్యం తేమ శాతం రెగ్యులర్ గా చెక్ చేయాలని, తాలు లేకుండా ప్యాడీ క్లీనర్ ద్వారా క్లీన్ చేయాలని అన్నారు.