ఉట్నూర్: తమ డిమాండ్లు నెరవేర్చాలని కోరుతూ ఉట్నూర్ ఐటీడీఏ కార్యాలయం ఎదుట సీఆర్టీలు నిరసన
డిమాండ్లు నెరవేర్చాలని ఐటీడీఏ పరిధిలోని గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో పనిచేస్తున్న సీఆర్టీలు ఆందోళన బాట పట్టారు.సీఆర్టీల యూనియన్ పిలుపు మేరకు ఈనెల 16నుంచి సమ్మె చేస్తున్న వారు మంగళవారం ఉట్నూర్‌లోని ఐటీడీఏ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు.రెగ్యులర్ ఉపాధ్యాయులతో సమానంగా పని చేస్తున్న తమకు తక్కువ వేతనాలు ఇస్తున్నారని, అది కూడా సకాలంలో చెల్లించడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు.ఎన్నికలపుడు ఇచ్చిన హామీ మేరకు రాష్ట్ర ప్రభుత్వం తమను క్రమబద్ధీకరించాలని,మినిమం టైం పే స్కేల్ ప్రకారం సీఆర్టీలకు వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు.