జిల్లా పరిధిలో చెక్ పోస్ట్ లు, డైనమిక్ చెక్ పోస్ట్ ల వద్ద ముమ్మరంగా తనిఖీలు నిర్వహించాలి: జిల్లా ఎస్పీ మురళీకృష్ణ
అనకాపల్లి జిల్లా పరిధిలో ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్ లు,డైనమిక్ చెక్ పోస్ట్ ల వద్ద ముమ్మరంగా తనిఖీలు నిర్వహించాలని పోలీస్ అధికారులను జిల్లా ఎస్పీ మురళీకృష్ణ ఆదేశించారు. అనకాపల్లి జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ నెలవారీ నేర సమీక్ష సమావేశం మంగళవారం సాయంత్రం నిర్వహించారు. పెండింగ్ కేసులు సాధారణ తీవ్రమైన కేసులు పోక్సో, గంజాయి, మిస్సింగ్ కేసులపై సమీక్షించారు. పెండింగ్ కేసులను త్వరతగతిన పరిష్కరించాలన్నారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో సోషల్ మీడియాలో దుష్ప్రచారాలు, ఫేక్ న్యూస్ లను వ్యాప్తి చేసే వారిపై కేసులు నమోదు చేసి, పటిష్టమైన దర్యాప్తు నిర్వహించాలన్నారు.