గుంతకల్లు: కరిడికొండ సమీపంలో నాలుగు పెద్ద పులుల సంచారం భయాందోళనలో గ్రామస్తులు.
గుత్తి మండలం కరిడికొండ సమీపంలోని కొండ ప్రాంతంలోని క్వారీ సమీపంలో నాలుగు పెద్ద పులులు శనివారం తెల్లవారుజామున సంచరిస్తున్న దృశ్యాలను లారీ డ్రైవర్ సెల్ఫోన్లో వీడియో చిత్రీకరించాడు. కరిడికొండ గ్రామ సమీపంలో పెద్ద పులుల సంచారం చేస్తుండడంతో గ్రామస్తులు భయాందోళన చెందుతున్నారు. ప్రస్తుతం పులులు సంచరిస్తున్న వీడియో నెట్టింట వైరల్ గా మారింది. విషయాన్ని ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు గ్రామస్తులు పోలీసులు అటవీ శాఖ అధికారులు గాలిస్తున్నారు.