అనకాపల్లిలో చిరు వ్యాపారులపై జీవీఎంసీ అధికారుల దౌర్జన్యం నశించాలి: సిఐటియు జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరావు
జీవీఎంసీ అధికారులు అనకాపల్లి పట్టణంలోని బడా బాబులను వదిలేసి చిరు వ్యాపారులపై తమ ప్రతాపాన్ని చూపుతున్నారని సిఐటియు అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు వివి శ్రీనివాసరావు అన్నారు, రోడ్డు పక్కన చిరు వ్యాపారాలు చేసుకుంటున్న వారిపై జీవీఎంసీ అధికారుల దౌర్జన్యం నశించాలంటూ బుధవారం అనకాపల్లి జీవీఎంసీ జోనల్ కార్యాలయం వద్ద చిరు వ్యాపారులతో సిఐటియు ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు.