పెన్పహాడ్: పెన్ పహాడ్ లో ప్రభుత్వ కార్యాలయాలను తనిఖీ చేసిన కలెక్టర్ తేజస్
విద్యార్థులు ఉన్నత లక్ష్యాన్ని ఎంచుకొని సాధించే దిశగా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ పేర్కొన్నారు. సోమవారం పెన్ పహాడ్ జడ్పీ హెచ్ ఎస్, కే జి బి వి, తహసీల్దార్ కార్యాలయాలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పదవ తరగతి తెలుగు మీడియం విద్యార్థులకి జరుగుతున్న బయో సైన్స్ సబ్జెక్ట్ క్లాస్ ని విద్యార్థులతో కలిసి విన్నారు అలాగే ఇంగ్లిష్ మీడియం పదవ తరగతిలో జరుగుతున్న ఇంగ్లిష్ సబ్జెక్టు పై విద్యార్థులని పలు ప్రశ్నలు అడిగి తెలుసుకున్నారు.