శ్రీశైల మహా క్షేత్రంలో ఆరుద్రా నక్షత్రాన్ని పురస్కరించుకుని శ్రీస్వామి అమ్మవార్లకు స్వర్ణరథోత్సవం వైభవంగా నిర్వహించారు.ఆరుద్రోత్సవంలో భాగంగా వేకువజామున మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, అన్నాభిషేకం, విశేష పూజలు నిర్వహించారు. అనంతరం ఉదయం 7.30 గంటలకు గంగాధర మండపం నుంచి నందిమండపం వరకు స్వర్ణరథోత్సవం భక్తుల శివనామస్మరణల మధ్య ఘనంగా సాగింది.దేశంలో శాంతి సౌభాగ్యాలు నెలకొనాలని, సకాలంలో వర్షాలు కురవాలని, ప్రకృతి వైపరీత్యాలు నివారించబడాలని, ప్రజలందరికీ ఆయురారోగ్యాలు కలగాలని అర్చకులు లోకకల్యాణార్థం సంకల్పం పఠించారు. రథోత్సవంలో కోలాటం, తప్పెట చిందులు, ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.