రాజపేట: దూది వెంకటాపురం గ్రామంలోని ప్రజల సమస్యలను పరిష్కరిస్తాం:యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు
యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలంలోని బుధవారం రాత్రి నుంచి గురువారం ఉదయం 9 గంటల వరకు పల్లెనిద్ర కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ హనుమంతరావు చేపట్టారు. ఈ సందర్భంగా బోనగిరి కలెక్టర్ హనుమంతరావు గ్రామస్తులతో సమావేశాన్ని నిర్వహించారు. గ్రామంలో ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అని ఆరాధించారు గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లు 24 మంజూరు అయ్యాయని కలెక్టర్ తెలిపారు. గ్రామంలో నెలకొన్న సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు. వివిధ శాఖల అధికారులు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కరరావు జిల్లా అధికారులంతా గ్రామంలో కలెక్టర్ వెంట ఉన్నారు.