ఫిబ్రవరి 13వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల రెడ్డి చేపట్టిన మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం పరిరక్షణ యాత్రలో భాగంగా ప్రకాశం జిల్లా, మార్కాపురం జిల్లాలోకి ప్రవేశిస్తున్న సందర్భంగా ఒంగోలు లోని ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు షేక్ సైదా జిల్లా ముఖ్య నాయకులతో సన్నాహాక సమావేశం ఏర్పాటు చేశారు.ఈ సమావేశంలో కొండేపి నియోజకవర్గం లోని సింగరాయకొండ మండలం పాకల గ్రామంలోఉదయం 10 గంటలకు జరిగే రచ్చబండ కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు