చిల్లకూరు మండలంలో కోటి సంతకాల సేకరణ
రాష్ట్రంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైసీపీ కోటి సంతకాల సేకరణ కార్యక్రమం ప్రారంభించింది. చిల్లకూరు మండలం తోనుకుమాల, తిక్కవరం, చేడిమాల, కలవకొండా గ్రామాలలో శనివారం వైసీపీ రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా ఎమ్మెల్సీ మెరీగ మురళీధర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్యకర్తల చేత సంతకాలు సేకరించారు. కూటమి మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ఆపాలని డిమాండ్ చేశారు.