కుటుంబ కలహాలు కారణంగా పట్నంలోని బీసీ కాలనీలో ఒక వ్యక్తి ఆత్మహత్య
నర్సీపట్నం బీసీ కాలనీలో ఆదివారం సాయంత్రం గోసరెడ్డి సత్యసాయి @ సతీష్ అనే వ్యక్తి ఇంట్లోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని పట్టణ పోలీసులు తెలిపారు నర్సీపట్నం ఎస్సీ కాలనీకి చెందిన గ్రామాల దివ్యశ్రీ అనే ఆమెను ఐదేళ్ల క్రితం సతీష్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు వీరికి నాలుగేళ్ల పాప కూడా ఉంది అయితే ఈ వివాహంపై సతీష్ కుటుంబీకులు తరచుగా అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ మానసిక వేదనతో ఆయన ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు అంటున్నారు. భార్య దివ్యశ్రీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పట్టణ పోలీసులు తెలిపారు.